![]() |
![]() |
.webp)
దిష్టి అనే కాన్సెప్ట్ కి అన్ని మతాల్లో కూడా స్పెషల్ ప్లేస్ ఉంది. కొత్త దుస్తులు వేసుకుంటే దిష్టి కొడుతుందని దానికి పసుపు రాసి వేసుకోమంటారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చూడడానికి అందంగా ఉంటే దిష్టి కొడుతుందని నల్ల తాడు కడతారు లేదంటే ముఖం మీద దిష్టి చుక్క పెడతారు. నరుడు చూపుకు నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మన వెనకటి తరాల్లో ఎక్కువగా ఉండేది. ఐతే ప్రస్తుత జెనెరేషన్ లో దీన్ని కొంతమంది నమ్ముతారు కొందరు నమ్మరు. పాజిటివ్ ఎనర్జీ అని నెగటివ్ ఎనేర్జి అని కొట్టి పారేస్తారు.
ఏదేమైనా అఖిల్ సార్థక్ కూడా దిష్టి కాన్సెప్ట్ మీద తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "మధ్య తరగతి వాళ్ళు ఏదైనా మంచి పిక్ ని అప్ లోడ్ చేస్తే చాలు వాళ్లకు దిష్టి కొట్టేస్తుంది. మరి అంబానీలు ఎంతో ఖరీదైన వస్తువులను ధరించి పిక్స్ పెడతారు, అందంగా కనిపిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళను పిలిచి అన్నీ చూపిస్తారు కదా..మరి వాళ్లకు ఎందుకు దిష్టి కొట్టదు...అంబానీ గారు మీకెందుకు దిష్టి కొట్టదు మాకే ఎందుకు దిష్టి కొడుతోంది. దిష్టి తగలకుండా మీరు ఫాలో అయ్యే సీక్రెట్ చెప్పండి" అని అడిగాడు. పాపం ఏమయ్యిందో కానీ తన పిక్ కి ఎవరు దిష్టి పెట్టారో కానీ అఖిల్ కన్నుకి ఏదో అయ్యింది. దాంతో కొంచెం అప్ సెట్ గా కనిపించాడు. కంటిని తుడుచుకుంటూ ఉన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి అండగా నిలుచున్నాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ మంచి అవకాశాలు వచ్చాయి కానీ అఖిల్ సార్థక్ కి మాత్రం ఇంకా కెరీర్ స్టార్ట్ కాలేదనే చెప్పొచ్చు. అవకాశాలు రావాలంటే రైట్ టైమ్ రావాలి.. దాని కోసమే ఎదురుచూస్తున్నాడు అఖిల్.
![]() |
![]() |